ప్రఖ్యాత డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ల కాంబినేషన్ లో వచ్చిన "యమదొంగ" సినిమా ఎంతటి సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. స్టూడెంట్ నెం. 1, సింహాద్రి తదుపతి ఈ కాంబోలో తెరకెక్కిన మూడవ సినిమా ఇది. 2007లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించింది.
2007, ఆగస్టు 15వ తేదీన విడుదలైన ఈ సినిమాకు నేటితో పదిహేనేళ్ళు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో యమదొంగ మూవీ పోస్టులను ట్రెండ్ చేస్తున్నారు.
ఎం ఎం కీరవాణి స్వరకల్పనలో రూపుదిద్దుకున్న ఈ సినిమా పాటలన్ని కూడా చార్ట్ బస్టర్లుగా నిలిచాయి. సోషల్ ఫాంటసీ గా రూపొందిన ఈ చిత్రంలో యముడిగా మోహన్ బాబు, చిత్రగుప్తుడిగా బ్రహ్మానందం నటించి ప్రేక్షకులను మెప్పించారు. హీరోయిన్ గా ప్రియమణి ఈ సినిమాలో నటించారు.