జయాపజయాల మధ్య కెరీర్ సాగించడం మిగతా అందరి నాయికల్లా మెహరీన్‌కూ అలవాటే. గతేడాది వరుస విజయాలు చూసిన ఈ భామ. ఈ ఏడాది కాస్త తడబడినా మంచి చిత్రాలు చేస్తూ భవిష్యత్‌పై ఆశగా ఉంది. నోటా ఇటీవల ఆమెను ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయగా…ప్రస్తుతం ఫన్ అండ్ ఫ్రస్టేషన్, సుధీర్ బాబు కొత్త చిత్రాలతో తీరిక లేకుండా ఉంది మెహరీన్. వేటికవి భిన్నమైన పాత్రలు చేయడం తొలి చిత్రం నుంచే అలవాటయ్యిందంటోందీ సుందరి. మోహరీన్ మాటల్లో వింటే..ఈ క్యారెక్టర్ చేస్తున్నప్పుడు…దీని ప్రభావం రాబోయే సినిమాలపై పడుతుందా అనే సందేహం ఎప్పుడూ కలగలేదు. ఎందుకంటే నటన అంటేనే ప్రతిసారీ కొత్తగా కనిపించడం. ఒక్క తరహాకు పరిమితం చేస్తారని భయపడితే పరిశ్రమలో ఏదీ సాధించలేం. అన్నది ఆమె మాట. ఇక ఈ ధైర్యం, సాహసం అంతా బాల్యం నుంచే వచ్చాయని మెహరీన్ తెలిపింది. ఆమె మాట్లాడుతూ…పంజాబీ కుటుంబంలో పుట్టిన నేను మగరాయుడిలా పెరిగాను. చేతులకు గోరింటాకు, గోర్లకు రంగు వేసుకోవడం ఎప్పుడూ తెలియదు. సాహసవంతమైన ఆటలు ఆడేదాన్ని. ఇంట్లో ప్రతి ఒక్కరు ఏదో ఒక క్రీడ నేర్చుకోవాలనే షరతు ఉండేది. చాలా మంది అమ్మాయిలు దూరంగా ఉండే షూటింగ్ క్రీడను నేను తీసుకున్నాను. మంచి తుపాకి కొని సాధన చేసేదాన్ని. అలా జాతీయస్థాయిలో పోటీల దాకా వెళ్లాను. ప్రధాన టోర్నమెంట్ జరిగే సమయానికి పరీక్షలు రావడం వల్ల షూటింగ్ క్రీడకు దూరమయ్యాను. తర్వాత నా ఆసక్తి మోడలింగ్ సినిమాల పైకి మళ్లింది. తెలుగులో కొత్త నాయిక కోసం చూస్తున్నారని తెలుసుకుని ఆడిషన్‌కు వెళ్లాను. అలా కృష్ణగాడి వీర ప్రేమగాథలో అవకాశం వచ్చింది. ఆ తర్వాత జరిగింది మీ అందరికీ తెలుసు. అంటూ నవ్వుతూ చెప్పింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa