ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'కార్తికేయ 2" డిజిటల్ పార్టనర్ ఖరారు

cinema |  Suryaa Desk  | Published : Tue, Aug 16, 2022, 03:43 PM

చందూ మొండేటి డైరెక్షన్లో నిఖిల్ సిద్దార్థ్, అనుపమ పరమేశ్వరన్ జంటగా, ఇండియాస్ మిస్టికల్ ఎడ్వెంచరస్ థ్రిల్లర్ గా తెరకెక్కిన చిత్రం "కార్తికేయ 2". శనివారం విడుదలైన ఈ మూవీ అన్నిచోట్లా హౌస్ ఫుల్ కలెక్షన్లతో రన్ అవుతుంది. హిందీలో ఈ సినిమాకొస్తున్న రెస్పాన్స్ సూపర్ గా ఉంది. 
లేటెస్ట్ గా కార్తికేయ 2 మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ పార్టనర్ ఖరారైనట్టు తెలుస్తుంది. ప్రముఖ జీ 5 ఓటిటి కార్తికేయ పోస్ట్ థియేట్రికల్ హక్కులను సొంతం చేసుకుంది. సో, ఆ ఓటిటిలోనే నెల రోజులు లేదా అంతకన్నా ఎక్కువ సమయం తరవాతనే ఈ మూవీ డిజిటల్ ఎంట్రీ ఇవ్వనుంది.
అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రాన్ని అభిషేక్ అగర్వాల్ నిర్మించారు.  కాలభైరవ సంగీతం అందించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa