సుధీర్ బాబు హీరోగా నటిస్తున్న "ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి" చిత్రం నుండి కొంచెంసేపటి క్రితమే "మీరే హీరోలా ఉన్నారు" అనే లిరికల్ సాంగ్ రిలీజ్ అయ్యింది. హైదరాబాద్ లో జరిగిన ఒక ఈవెంట్లో మీడియా చేతుల మీదుగా ఈ పాట విడుదలైంది. వివేక్ సాగర్ స్వరపరిచిన ఈ పాటను విజయ్ ప్రకాష్ ఆలపించారు. సరస్వతీపుత్ర రామజోగయ్య శాస్త్రి సాహిత్యమందించారు.
అష్టాచెమ్మా ఫేమ్ ఇంద్రగంటి మోహనకృష్ణ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కృతిశెట్టి హీరోయిన్ గా నటిస్తుంది. సెప్టెంబర్ 16వ తేదీన ఈ చిత్రం థియేటర్లలో విడుదల కాబోతుంది.
మైత్రి మూవీ మేకర్స్, బెంచ్ మార్క్ స్టూడియోస్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి మహేంద్ర బాబు, కిరణ్ బళ్ళపల్లి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రంలో శ్రీనివాస్ అవసరాల, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ తదితరులు కీలకపాత్రలు పోషించారు.