"సీతారామం" సినిమా ఆగస్టు 5వ తేదీన విడుదలై ఎంతటి ఘనవిజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అప్పటివరకు ఉసూరుమంటూ ఉన్న టాలీవుడ్ బాక్సాఫీస్ కు సీతారామం కొత్త ఊపిరి అందించింది.
ఈ మూవీ డైరెక్టర్ హను రాఘవపూడి ముందుగా ఈ స్క్రిప్ట్ ను రౌడీ హీరో విజయ్ దేవరకొండకు వినిపించగా, హీరో క్యారెక్టర్ తనకంత సూట్ అవ్వదని వదులుకున్నాడట. విజయ్ కన్నా ముందు హను సీతారామం స్క్రిప్ట్ ను నాచురల్ స్టార్ నానికి వినిపించారట. అసలు ఆయనను దృష్టిలో పెట్టుకునే హను ఈ మూవీ స్టోరీని రాసుకున్నారట. నాని ఎంతకూ స్పందించకపోవడంతో, హను ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని ఈ మూవీ స్టోరీని వినిపించారట. రామ్ కూడా విజయ్ లానే హీరో క్యారెక్టర్ తనకంత సూట్ కాదని రిజెక్ట్ చేసారంట.
ఆఖరికి లెఫ్టినంట్ రామ్ గా నటించే బంపరాఫర్ దుల్కర్ సల్మాన్ ను వెతుక్కుంటూ వెళ్ళింది. సీతారామం సినిమాకు, దుల్కర్ రిమార్కబుల్ యాక్టింగ్ కు తెలుగు ప్రేక్షకులు ఫుల్ ఫిదా అవుతున్న విషయం తెలిసిందే.