మలయాళ హిట్ మూవీ "ప్రేమమ్" తో సినీరంగ ప్రవేశం చేసిన అనుపమ పరమేశ్వరన్ ఆపై టాలీవుడ్ కొచ్చి ఇక్కడే ఎక్కువ సినిమాలు చేస్తూ లీడ్ హీరోయిన్ గా దూసుకుపోతుంది. ఇటీవలే అనుపమ నటించిన "కార్తికేయ 2" విడుదలై సూపర్ హిట్ టాక్ తెచ్చుకోవడంతో, కాస్తంత నెమ్మదించిన అనుపమ తిరిగి ఫామ్ లోకొచ్చినట్టయ్యింది.
కార్తికేయ 2 హిందీనాట బాగా హిట్ అవ్వడం, మంచి పాజిటివ్ మౌత్ టాక్ ఉండడం తో ఈ సినిమాను చూడడానికి జనాలు ఎగబడుతున్నారు. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, అనుపమకు ప్రముఖ హిందీ నిర్మాణ సంస్థ నుండి బిగ్ ఆఫర్ వచ్చిందట. తమ నిర్మాణ సంస్థ ద్వారా అనుపమను బాలీవుడ్ లో లాంచ్ చేసేందుకు ఆ నిర్మాణ సంస్థ అనుపమతో చర్చలు జరుపుతుందట. మరి , ఈ విషయంలో ఎంతవరకు నిజముందో తెలియాలంటే, అనుపమ రెస్పాండ్ అవ్వాల్సిందే.