కోలీవుడ్ స్టార్ హీరో విజయ్, తెలుగు డైరెక్టర్ వంశీ పైడిపల్లి కాంబోలో "వారసుడు" అనే సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. తమిళంలో "వారిసు" టైటిల్ తో రిలీజ్ కాబోతున్న ఈ చిత్రంతోనే టాలీవుడ్ మోస్ట్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ దిల్ రాజు కోలీవుడ్ రంగానికి ఎంట్రీ ఇవ్వబోతున్నారు.
లేటెస్ట్ గా ఈ సినిమాపై ఒక ఇంటరెస్టింగ్ బజ్ వినిపిస్తుంది. దాని ప్రకారం, ఈ సినిమాలో విజయ్ కు విలన్గా ప్రముఖ డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ నటించబోతున్నారని ప్రచారం జరుగుతుంది. మరి ఈ విషయంలో టీం అఫీషియల్ క్లారిటీ ఇచ్చేంత వరకు ఎదురుచూడాల్సిందే.
రష్మిక మండన్నా ఇందులో హీరోయిన్ గా నటిస్తుండగా, తమన్ సంగీతం అందిస్తున్నారు.