మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ షణ్ముగం డైరెక్షన్లో ఒక సినిమాను చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ చెర్రీ కెరీర్ లో 15వ సినిమా కావడంతో RC 15 అని పిలుస్తున్నారు. ఇందులో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుండగా, కోలీవుడ్ డైరెక్టర్ కమ్ యాక్టర్ సూర్య sj కీలకపాత్రలో నటిస్తున్నారు.
లేటెస్ట్ గా రామ్ చరణ్ తన డైరెక్టర్ కు స్పెషల్ ట్వీట్ చేసారు. అదేంటంటే, ఈ రోజు శంకర్ పుట్టినరోజు. దీంతో తన డైరెక్టర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలను తెలుపుతూ చెర్రీ ట్వీట్ చేసారు. ఈ సందర్భంగా శంకర్ తో కలిసి పని చెయ్యడం చాలా గొప్ప అనుభవమని, RC 15 సినిమా కోసం ఎదురుచూస్తున్నాని, అందులో మీరు చేసే మ్యాజిక్ కోసం ఎదురుచూస్తున్నట్టు చెర్రీ తెలిపారు.