సినిమా చూపిస్తా మావ, నేను లోకల్, హలో గురు ప్రేమకోసమే సినిమాల డైరెక్టర్ నక్కిన త్రినాథరావు డైరెక్షన్లో ఔటండౌట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపుదిద్దుకుంటున్న చిత్రం "ధమాకా". ఇందులో రవితేజ హీరోగా నటిస్తున్నారు. రవితేజ సరసన 'పెళ్లి సందడి' ఫేమ్ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది.
ఈ చిత్రం నుండి తొలి లిరికల్ సాంగ్ గా 'జింతాక్' అనే మాస్సీ లిరికల్ సాంగ్ ను ఆగస్టు 18వ తేదీన మధ్యాహ్నం 12:01 గంటలకు విడుదల చెయ్యనున్నట్టు మేకర్స్ అఫీషియల్ ఎనౌన్స్మెంట్ చేసిన విషయం తెలిసిందే. లేటెస్ట్ గా ఈ పాట యొక్క గ్లిమ్స్ ను రిలీజ్ చేసారు. ఈ పాట పాడిన సింహ, మంగ్లీ, ఇంకా రచయిత, మ్యూజిక్ డైరెక్టర్ అందరు కలిసి జింతాక్ ఐకానిక్ స్టెప్ వేస్తున్న ఈ వీడియోలో బ్యాక్ గ్రౌండ్ సాంగ్ మంచి పెప్పి మ్యూజిక్ తో ఉంది.
ఈ చిత్రానికి భీమ్స్ సంగీతం అందిస్తుండగా, అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్నారు.