రౌడీ హీరో విజయ్ దేవరకొండ తొలి సారి నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం "లైగర్" బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలని విజయ్ అమ్మ మాధవి ప్రత్యేక పూజలు నిర్వహించినట్టు తెలుస్తుంది. ఈ మేరకు కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఈ ఫొటోల్లో అర్చకులు విజయ్ అనన్యాలను వేదాశీర్వచనాలతో దీవించడం, చేతికి రక్షతాడు కట్టుకోవడం కనిపిస్తుంది. మరి, ఆగస్టు 25వ తేదీన తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం, హిందీ భాషలలో విడుదలవబోతున్న ఈ చిత్రం ఆరోజు ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో చూడాలి.
ఈ సినిమాకు పూరి జగన్నాధ్ డైరెక్టర్ కాగా, కరణ్ జోహార్, ఛార్మి, పూరి సంయుక్తంగా నిర్మించారు. మైక్ టైసన్, రమ్యకృష్ణ, మకరంద్ దేశ్ పాండే కీలకపాత్రలు పోషించారు.