రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న కొత్త చిత్రం "లైగర్". అనన్యా పాండే హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు.
ప్రపంచవ్యాప్తంగా పాన్ ఇండియా భాషల్లో ఆగస్టు 25వ తేదీన విడుదల కాబోతున్న ఈ మూవీ దేశవ్యాప్తంగా టూర్లు నిర్వహిస్తూ, ప్రేక్షకాభిమానులను పలకరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో లైగర్ టీం రేపు అంటే ఆగస్టు 18వ తేదీన కేరళ లోని కొచ్చి లో ఒక గ్రాండ్ ఈవెంట్ నిర్వహించబోతుంది. రేపు సాయంత్రం ఐదు గంటలకు ప్రెస్ మీట్, తదుపరి ఆరింటికి కల్లూరు GCDA గ్రౌండ్స్ లో గ్రాండ్ ఈవెంట్ జరగబోతున్నట్టు మేకర్స్ అఫీషియల్ ఎనౌన్స్మెంట్ చేసారు.