కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ ఇటీవల యాక్షన్ థ్రిల్లర్ వాలిమైతో బాక్స్ఆఫీస్ వద్ద పెద్ద హిట్ సాధించాడు. తాజాగా అజిత్ దర్శకుడు హెచ్ వినోద్ అండ్ నిర్మాత బోనీ కపూర్‌తో కలిసి మరో సినిమా చేస్తున్నట్లు ప్రకటించాడు. ఈ సినిమాకి టెంపరరీగా 'AK61' అనే టైటిల్ ని లాక్ చేసారు. ఈ సినిమా సింపుల్ గా లాంచ్ అయిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రం బ్యాంకు దోపిడీకి సంబంధించినదని, అజిత్ ఈ సినిమాలో నెగిటివ్ రోల్‌లో కనిపించనున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. లేటెస్ట్ అప్‌డేట్ ప్రకారం, ఈ సినిమా తదుపరి షెడ్యూల్ వైజాగ్‌లో ప్రారంభించినట్లు సమాచారం. ఈ సినిమాలో అజిత్ సరసన మంజు వారియర్ జోడిగా కనిపించనుంది. మరికొద్ది రోజుల్లో ఈ గ్లామర్ బ్యూటీ సెట్‌లో జాయిన్ అయ్యే అవకాశం ఉంది అని సమాచారం.