పూరి జగన్నాధ్ దర్శకత్వంలో టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ "లైగర్" సినిమాలో నటిస్తున్న విషయం అందరికి తెలిసిందే. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన జోడిగా బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే జోడిగా నటిస్తుంది. ఓవర్సీస్ ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్‌లో అగ్రగామిగా ఉన్న సరిగమ సినిమాస్ అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'లైగర్' రైట్స్ ని సొంతం చేసుకున్నట్లు మూవీ మేకర్స్ అధికారకంగా ప్రకటించారు. స్పోర్ట్స్ డ్రామా ట్రాక్ లో రానున్న ఈ సినిమా ఆగస్ట్ 25న తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల కానుంది. తాజా అప్‌డేట్ ప్రకారం, USAలో అతిపెద్ద సినిమా చైన్ సినిమార్క్ USAలో లైగర్ ప్రీమియర్‌ల కోసం ముందుగానే బుకింగ్‌లను ప్రారంభించింది. ఈ సినిమాలో లెజెండరీ బాక్సర్ మైక్ టైసన్ కీలక పాత్రను పోషిస్తున్నాడు. రమ్యకృష్ణ, రోనిత్ రాయ్, విషు రెడ్డి, అలీ, మకరంద్ దేశ్ పాండే, గెటప్ శ్రీను ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. పూరి కనెక్ట్స్, ధర్మ ప్రొడక్షన్స్‌తో కలిసి ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మించారు.