జబర్దస్త్ షో ఎంతో కాలంలో నవ్వులు పంచుతున్న విషయం తెలిసిందే. ఈ షోకు ఉన్న ఫాలోయింగ్, పాపులారిటీ ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. జార్జీలు , కంటెస్టెంట్స్ మారినా కూడా షో రేటింగ్ ఏమాత్రం తగ్గలేదు. ఎందరో కమెడియన్స్‌ను పరిచయం చేసింది ఈ బుల్లితెర నవ్వుల షో. ఇప్పుడు వారిలో చాలామంది సిల్వర్ స్క్రీన్‌పై సైతం రాణిస్తున్నారు. అయితే గతంలో స్కిట్‌లోని పాత్రల కోసం మగవాళ్లే లేడీ గెటప్పులు వేసేశారు. కానీ గత 3,4 ఏళ్లుగా లేడీ ఆర్టిస్టులు సైతం ఇందులో కనిపిస్తున్నారు. మంచి పేరు తెచ్చుకుంటున్నారు. వారిలో ఒకరు షబీనా షేక్. 'కస్తూరి', 'అత్తారింటికి దారేది', 'నా పరమ మీనాక్షి' వంటి సీరియల్స్‌లో నటించింది. ఆ తర్వాత జబర్దస్త్‌లోకి అడుగుపెట్టి మంచి పేరు తెచ్చుకుంది. కెవ్వు ఎక్కువగా కార్తీక్ స్కిట్స్‌లో నటించింది. జబర్దస్త్ నటి షబీనా షేక్ త్వరలో పెళ్లి పీటలు ఎక్కనుంది. కాబోయే భర్త మున్నాతో దిగిన ఎంగేజ్‌మెంట్ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో బుధవారం పోస్ట్ చేసింది. పలువురు సీరియల్ నటులు, సెలబ్రెటీలు ఈ జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.