"జాతిరత్నాలు" ఫేమ్ అనుదీప్ కేవీ అందించిన కథతో ఫస్ట్ డే ఫస్ట్ షో (FDFS) అనే సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా సెప్టెంబర్ 2వ తేదీన గ్రాండ్ రిలీజ్ కాబోతుంది.
లేటెస్ట్ గా ఈ మూవీ టీం ఇన్స్టాగ్రామ్ లైవ్ లోకి రాబోతున్నట్టు అఫీషియల్ గా ఎనౌన్స్ చేసారు. ఈ రోజు సాయంత్రం ఐదింటికి FDFS మూవీ టీం నుండి అనుదీప్, మ్యూజిక్ డైరెక్టర్ రధన్, హీరోయిన్ సంచితా బసు, హీరో శ్రీకాంత్ రెడ్డి, డైరెక్టర్లు వంశీధర్ గౌడ్, లక్ష్మి నారాయణ్ ఇన్స్టాగ్రామ్ లైవ్ లో పాల్గొనబోతున్నారు.
ఇటీవల విడుదలైన ఈ మూవీ పాటలకు, టీజర్ కు ప్రేక్షకుల నుండి మంచి స్పందన వస్తుంది. నిన్నటితరం సక్సెస్ ఫుల్ ప్రొడక్షన్ హౌస్ పూర్ణోదయా ఫిలిమ్స్ ఈ సినిమాతో టాలీవుడ్ కి రీఎంట్రీ ఇస్తుంది.