పాన్ ఇండియా మూవీ "లైగర్" ట్రయో హీరో విజయ్ దేవరకొండ, డైరెక్టర్ పూరి జగన్నాధ్, సహా నిర్మాత ఛార్మి ముగ్గురు కలిసి ఒక ఫన్ అండ్ ఎక్సయిటింగ్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. అభిమానులకు లైగర్ మూవీపై ఉన్న సందేహాలను పూరి, విజయ్ లను ఫ్యాన్స్ తరపున ఛార్మి అడిగే ఈ ఇంటర్వ్యూ యొక్క ప్రోమోను రిలీజ్ చేసారు. ఫుల్ ఇంటర్వ్యూను రేపు విడుదల చేయనున్నారు.
ఈ ఇంటర్వ్యూలో లైగర్ చూడటానికి థియేటర్లకు ప్రేక్షకులు రాకపోతే ఏం చేస్తారు?, చేతిలో చిల్లిగవ్వ లేకున్నా భారీ ఓటిటి డీల్ వచ్చినప్పుడు ఎందుకు వదులుకున్నారు? మైక్ టైసన్ ను ఎందుకు ఫన్నీ వేలో చూపించారు? లాంటి ప్రశ్నలకు పూరి, విజయ్ సమాధానం ఇవ్వనున్నారు.
పాన్ ఇండియా భాషల్లో లైగర్ మూవీ ఆగస్టు 25వ తేదీన విడుదల కాబోతుంది. రమ్యకృష్ణ, మకరంద్ దేశ్ పాండే కీలకపాత్రలు పోషించారు.