కొరటాల శివ - సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబోలో వచ్చిన "భరత్ అనే నేను"తో తెలుగు తెరకు పరిచయమైన బాలీవుడ్ నటి కియారా అద్వానీ. ఆపై మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వచ్చిన "వినయ విధేయ రామ"లో నటించింది. లేటెస్ట్ గా చెర్రీ - శంకర్ కాంబోలో తెరకెక్కుతున్న "RC 15" లో హీరోయిన్ గా నటిస్తుంది.
కియారా అద్వానీ స్వతహాగా బాలీవుడ్ నటి. బాలీవుడ్ స్టార్ హీరో సిద్దార్ధ్ మల్హోత్రాతో కలిసి కియారా డేటింగ్ చేస్తుందని ఎప్పటి నుండో బాలీవుడ్ మీడియా కోడై కూస్తుంది. ఐతే, ఇప్పటివరకు వీరిద్దరూ ఎప్పుడూ వారి రిలేషన్ ను అధికారికంగా ఎనౌన్స్ చెయ్యలేదు.
లేటెస్ట్ గా సిద్దార్ధ్ బాలీవుడ్ సూపర్ పాపులర్ షో "కాఫీ విత్ కరణ్" షోలో పాల్గొనగా, కరణ్ అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ... కియారా తో తానొక సంతోషకరమైన మరియు ఉజ్వల భవిష్యత్తును కోరుకుంటున్నానని చెప్పాడు. దీంతో వీరిద్దరూ పీకల్లోతు ప్రేమలో ఉన్నారని, త్వరలోనే పెళ్లి పీటలెక్కినా ఆశ్చర్యపోనవసరం లేదని తెలుస్తుంది.
![]() |
![]() |