టాలీవుడ్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి నందమూరి బాలకృష్ణతో ఒక సినిమాకు కమిటైన విషయం తెలిసిందే. బాలయ్య పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీ అఫీషియల్ ఎనౌన్స్మెంట్ జరిగింది. ఇటీవలే ఈ మూవీ స్క్రిప్ట్ ను ఫైనలైజ్ చేసి, విశాఖపట్నం, సింహాచలం శ్రీ వరాహ లక్ష్మి నరసింహస్వామి పాదాల వద్ద ఉంచి ప్రత్యేక పూజలు కూడా చేయించారు అనిల్.
లేటెస్ట్ బజ్ ప్రకారం, ఈ మూవీ బడ్జెట్ ను అనిల్ 80 కోట్లుగా తేల్చారంట. 80 కోట్లంటే ... అనిల్ రావిపూడి ఇప్పటి వరకు డైరెక్ట్ చేసిన సినిమాలలో ఇదే హైయెస్ట్. ఇంకా బాలకృష్ణ కెరీర్ లో కూడా ఇదే హైయెస్ట్ బడ్జెట్. మరి ఈ విషయంలో అఫీషియల్ క్లారిటీ రావలసి ఉంది.
షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై ఈ మూవీ నిర్మింపబడుతుంది. ఇందులో యంగ్ బ్యూటీ శ్రీ లీల ఒక ప్రత్యేక పాత్రలో నటిస్తుంది.