డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ డైరెక్షన్లో రౌడీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా నటించిన చిత్రం "లైగర్". ఇందులో బాలీవుడ్ యంగ్ బ్యూటీ అనన్యా పాండే హీరోయిన్ గా నటిస్తుంది. బాక్సింగ్ నేపథ్యంలో సాగే ఈ సినిమాను ప్రఖ్యాత బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ తో కలిసి పూరి జగన్నాధ్, ఛార్మి సంయుక్తంగా నిర్మించారు. బాక్సింగ్ దిగ్గజం మైక్ టైసన్ ఈ సినిమాతో భారతీయ సినీ రంగ ప్రవేశం చెయ్యడం విశేషం.
ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 25వ తేదీన పాన్ ఇండియా భాషల్లో విడుదల కాబోతున్న ఈ చిత్రానికి సెన్సార్ యూ/ ఏ సెర్టిఫికెట్ గతంలోనే ఇచ్చింది. ఐతే కొన్ని సూచనలు చేసిందట. F *** పాదాలను, ఆ పదం అర్ధం వచ్చే సీన్ల పట్ల అభ్యంతరం తెలుపుతూ, వాటిని కోతకు గురిచెయ్యాలని సూచించిందట. మరి లైగర్ మేకర్స్ ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.