ఆగస్టు 13వ తేదీన పాన్ ఇండియా భాషల్లో విడుదలైన తెలుగు చిత్రం "కార్తికేయ 2" ప్రేక్షకులను ఎంతలా మెస్మరైజ్ చేస్తుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
సౌత్ , నార్త్ అనే తేడా లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులు కూడా కార్తికేయ 2 సినిమాకు బ్రహ్మరధం పడుతున్నారు. ముందుగా యాభై స్క్రీన్స్ లో విడుదలైన ఈ సినిమా వారం తిరిగేసరికి వెయ్యికి పైగా స్క్రీన్లలో ప్రదర్శింపబడుతోంది.
ఈ మూవీ సక్సెస్ సెలెబ్రేషన్స్ లో భాగంగా మేజర్ సిటీలను పర్యటిస్తున్న టీం లేటెస్ట్ గా ఈ రోజు తిరుపతి పుణ్యక్షేత్రానికి పయనమవనుంది. నాలుగింటికి ఇస్కాన్ సెలెబ్రేషన్స్, ఐదింటికి బైక్ ర్యాలీ, ఆరున్నరకు PGR థియేటర్ విజిట్, ఏడున్నరకు ప్రెస్ మీట్ జరగనుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa