సూపర్ స్టార్ మహేష్ బాబు నుండి వచ్చిన కొత్త చిత్రం "సర్కారువారి పాట" నేటితో వంద రోజుల ధియేటర్ రన్ పూర్తి చేసుకుంది. ఈ మేరకు సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు. సోషల్ మీడియాలో ఈ విషయంపై ప్రత్యేక పోస్టులను పెడుతున్నారు.
పరశురామ్ పెట్ల డైరెక్షన్లో ఔటండౌట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ చిత్రంలో మహేష్ కు జోడిగా కీర్తి సురేష్ నటించింది. తమన్ సంగీతం అందించారు.
విశేషమేంటంటే, ఈ సినిమాకు ఎంతలా నెగిటివ్ టాక్ వచ్చినా, కలెక్షన్లు మాత్రం విపరీతంగా వచ్చాయి. వరల్డ్ వైడ్ గా 235 కోట్ల గ్రాస్, 130 కోట్ల షేర్ ను అందుకున్న ఈ సినిమా ఓవర్ సీస్ లో కూడా మంచి వసూళ్లను రాబట్టింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa