టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి నటసింహ నందమూరి బాలకృష్ణతో ఒక సినిమా చేస్తున్నట్లు అధికారకంగా ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ కాంబినేషన్ లో రానున్న సినిమా కోసం నందమూరి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. తాజాగా ఇప్పుడు ఈ చిత్రాన్ని 2023 ఏప్రిల్ 4న విడుదల చేయడానికి మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు ఫిలిం సర్కిల్ లో లేటెస్ట్ టాక్. త్వరలోనే ఈ విషయం గురించి మూవీ మేకర్స్ నుండి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఈ సినిమా దాదాపు 80 కోట్ల బడ్జెట్ తో రూపొందనుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్త పై మూవీ మేకర్స్ ఇంకా అధికారక ప్రకటన ఇవ్వనప్పటికీ ఈ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దసరా పండుగ తర్వాత సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లాలని మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం బాలకృష్ణ, గోపీచంద్ మలినేని దర్శకత్వంలో 'NBK107' సినిమాతో బిజీగా ఉన్నారు.