పెళ్లి చూపులు మరియు ఈ నగరానికి ఏమైంది వంటి హిట్ సినిమాలకి దర్శకత్వం వహించిన తరుణ్ భాస్కర్ దాస్యం కామెడీ మరియు యూత్ ఫుల్ సినిమాలను తీయడంలో స్పెషలిస్ట్ గా పేరు తెచ్చుకున్నాడు. తాజాగా ఇప్పుడు క్రైమ్ కామెడీ 'కీడ కోలా' అనే సినిమాతో ప్రేక్షకులని అలరించడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ పాన్-ఇండియన్ మూవీ రేపు ప్రారంభించబడుతుందని తన సోషల్ మీడియా ప్రొఫైల్‌లో ప్రకటించారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ సినిమాపై చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. 2023లో ఈ సినిమా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదల కానుంది. భరత్ కుమార్, శ్రీపాద్ నందిరాజ్, ఉపేంద్ర వర్మ, శ్రీనివాస్ కౌశిక్, సాయికృష్ణ గద్వాల్, విజయ్ కుమార్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ గురించి మరిన్ని వివరాలు మూవీ మేకర్స్ త్వరలో వెల్లడి చేయనున్నారు.