మోహన రాజా దర్శకత్వంలో టాలీవుడ్ మెగా స్టార్ చిరంజీవి ఒక సినిమా చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకి "గాడ్ ఫాదర్" అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. ఈ సినిమా మలయాళంలో "లూసిఫర్" సినిమాకు రీమేక్. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కీలక పాత్రలో కనిపించనున్నాడు. పొలిటికల్ డ్రామా ట్రాక్ లో రానున్న ఈ సినిమాలో చిరంజీవి సోదరిగా లేడీ సూపర్ స్టార్ నయనతార నటిస్తోందని సమాచారం. ఈరోజు మెగాస్టార్ చిరు పుట్టినరోజు సందర్భంగా చిత్ర నిర్మాతలు ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ సినిమా టీజర్ యూట్యూబ్‌లో ట్రేండింగ్ నెం.1 గా ఉంది. సోషల్ మీడియాలో ఇదే విషయాన్ని ప్రకటిస్తూ, గాడ్ ఫాదర్ మూవీ మేకర్స్ ట్వీట్ చేసారు. పూరి జగన్నాధ్, సునీల్, సత్యదేవ్ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ ప్రాజెక్ట్ గురించి మరిన్ని వివరాలు మేకర్స్ త్వరలో వెల్లడి చేయనున్నారు.