రమేష్ వర్మ దర్శకత్వంలో టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటించిన క్రైమ్ థ్రిల్లర్ 'రాక్షసుడు' సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ స్టార్ డైరెక్టర్ రమేష్ వర్మ తన తదుపరి ప్రాజెక్ట్‌ను ప్రకటించి టైటిల్ పోస్టర్‌ను కూడా రివీల్ చేసారు. రాక్షసుడు చిత్రానికి సీక్వెల్‌గా వస్తున్న ఈ చిత్రానికి 'రాక్షసుడు 2' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. ఈ సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభం కానుందని సమాచారం. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ సినిమాలో ప్రధాన పాత్రలో నటించేందుకు స్టార్ హీరో కిచ్చా సుదీప్ నటిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఎ స్టూడియోస్ పతాకంపై సత్యనారాయణ కోనేరు ఈ చిత్రాన్ని హవీష్ ప్రొడక్షన్‌పై నిర్మిస్తున్నారు. గిబ్రాన్ ఈ సీనాంకి సంగీతం అందిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ గురించి మరిన్ని వివరాలు మూవీ మేకర్స్ త్వరలో వెల్లడి చేయనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa