చియాన్ విక్రమ్ హీరోగా అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో ఎస్‌ఎస్ లలిత్ కుమార్ నిర్మించిన చిత్రం ‘కోబ్రా’. ‘కేజీఎఫ్’ ఫేమ్ శ్రీనిధి శెట్టి ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటించారు ఈ చిత్రం ఆగస్ట్ 31న థియేటర్లోకి రాబోతోంది. ఇక ప్రమోషన్స్ పోరు పెంచిన చిత్ర బృందం తాజాగా ఈ మూవీ తెలుగు టీజర్‌ను రిలీజ్ చేసంది. ఇందులో ‘కోబ్రా.. లెక్కలతో నేరాలను చాలా తెలివిగా చేస్తున్నాడు’ అనే డైలాగ్ ఆసక్తిగా ఉంది. ఈ ఇందులో చియాన్ విక్రమ్ విభిన్న పాత్రల్లో కనిపించి మరోసారి ఫ్యాన్స్ ఫిదా చేయబోతున్నాడు. ఇక ఇందులో క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ పలు కీలక సన్నివేశాల్లో కనిపించాడు. ఇక టీజర్ చూస్తుంటే లెక్కల మాస్టర్‌గా కోబ్రా అన్యాయాన్ని ఎలా ఎదుర్కొన్నాడనేదే ఈ కథ అని అర్థమవుతోంది. 7 స్క్రీన్ స్టూడియో సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రంలో మృణాళిని, రవి, కేఎస్ రవికుమార్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఇక క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ ముఖ్యపాత్రలో సందడి చేయనున్నారు. ఈ సినిమాకు ఎఆర్ రెహమాన్ సంగీతం అందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa