మారుతీ డైరెక్షన్ లో టాలీవుడ్ యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ఒక సినిమా చేస్తున్న సంగతి అందరికి తెలిసందే. ఈ సినిమాకి "రాజా డీలక్స్" అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసినట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. లేటెస్ట్ అప్‌డేట్ ప్రకారం, ఈ చిత్రం రేపు (ఆగస్టు 25) హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో ప్రారంభం కానుంది. అంతేకాకుండా మూవీ మేకర్స్ ఈ సినిమా టైటిల్ పోస్టర్ ని కూడా రివీల్ చేసే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రంలో మాళవిక మోహనన్‌లు కథానాయికగా నటించనున్నారు. ఈ సినిమాలో పరేష్ రావల్ ముఖ్యమైన పాత్రలో కనిపించవచ్చు అని సమాచారం. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. ఈ ప్రాజెక్ట్ కి సంబందించిన మరిన్ని వివరాలు మేకర్స్ త్వరలో వెల్లడి చేయనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa