ట్రెండింగ్
Epaper    English    தமிழ்

లాల్‌సింగ్‌ చడ్డా ప్రపంచ వ్యాప్తంగా రికార్డు

cinema |  Suryaa Desk  | Published : Wed, Aug 24, 2022, 03:49 PM

ఆమిర్‌ ఖాన్‌ హీరోగా నటించిన తాజా చిత్రం 'లాల్‌సింగ్‌ చడ్డా’.ఈ చిత్రం  అద్వెత్‌ చందన్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కరీనా కపూర్, అక్కినేని నాగ చైతన్య  కీలక పాత్రలు పోషించారు. వైయకామ్ స్టూడియోస్, పారామౌంట్ పిక్చ‌ర్స్, ఆమిర్ ఖాన్ ప్రొడ‌క్ష‌న్స్ పతాకంపై  ఆమిర్ ఖాన్, కిర‌ణ్ రావు, జ్యోతి దేశ్ పాండే, అజిత్ అంధారే లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు ఈ చిత్రం  .ఆస్కార్‌ విన్నింగ్‌ ఫిల్మ్‌ ‘ఫారెస్ట్‌ గంప్‌’కు హిందీ  రీమేక్‌గా వచ్చిన ఈ చిత్రంపై బాలీవుడ్‌ భారీ ఆశలు పెట్టుకుంది. వరుసగా డిజాస్టర్లతో సతమతమవుతున్న బాలీవుడ్‌ బాక్సాఫీస్‌కు ఊపిరి అందిస్తుందని భావించారు. కానీ ఆగస్ట్‌ 11న విడుదలైన ఈచిత్రం భారీ డిజాస్టర్‌గా నిలిచింది. ఆమిర్ ఖాన్ ఈ మూవీపై ఎన్నో ఆశలు పెట్టుకున్నా.. ఆ ఆశలన్నీ అడియాసలయ్యాయి.  ఇండియాలో దాదాపు రూ.60 కోట్లను మాత్రమే వసూలు చేసి ఆమిర్‌ కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ డిజాస్టర్‌గా నిలిచింది. అయితే విదేశాల్లో మాత్రం ‘లాల్‌సింగ్‌’ రికార్డు సృష్టించాడు. ఈ ఏడాది విదేశాల్లో అత్యధిక వసూళ్లను రాబట్టిన హిందీ చిత్రంగా ‘లాల్‌సింగ్‌ చడ్డా’ నిలిచింది. ఓవర్సీస్‌లో 7.5 మిలియన్ల డాలర్స్‌ కలెక్ట్‌ చేసింది  ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం ఇప్పటి వరకు  రూ.126 కోట్లను వసూలు చేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa