కొత్త డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్లో నాచురల్ స్టార్ నాని నటిస్తున్న చిత్రం "దసరా". "నేను లోకల్" సినిమాలో మొదటిసారి జంటగా నటించిన నాని, కీర్తిసురేష్ రెండవసారి ఈ సినిమాలో జంటగా నటిస్తున్నారు. నాని కెరీర్ లో అత్యధిక భారీ బడ్జెట్టుతో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి మరొక స్పెషలిటీ కూడా ఉంది. అదేంటంటే, ఈ సినిమాతోనే నాని ఫస్ట్ టైం పాన్ ఇండియా బరిలోకి దిగబోతున్నాడు.
లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, రేపే ఈ మూవీ కొత్త షెడ్యూల్ ప్రారంభం కాబోతుంది. ఇప్పటికే పలు కీలక షెడ్యూల్స్ ముగించిన ఈ చిత్రం రేపు మరో కొత్త షెడ్యూల్ ను ప్రారంభించబోతుంది.
సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని ఎస్ ఎల్ వి బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa