రణ్ బీర్ కపూర్, ఆలియాభట్ తొలిసారి స్క్రీన్ షేర్ చేసుకుంటున్న చిత్రం "బ్రహ్మాస్త్ర". అయాన్ ముఖర్జీ డైరెక్షన్లో ఇండియన్ మైథలాజికల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ మూవీ సెప్టెంబర్ 30వ తేదీన పాన్ ఇండియా భాషల్లో విడుదల కాబోతుంది.
లేటెస్ట్ గా ఈ రోజు చెన్నైలో ఈ మూవీ ప్రమోషన్స్ జరిగాయి. ఈ ఈవెంట్లో రణ్ బీర్ కపూర్, రాజమౌళి, నాగార్జున పాల్గొన్నారు. కోలీవుడ్ లో ఏ హీరోను డైరెక్ట్ చెయ్యాలనుందని రాజమౌళిని ప్రశ్నించగా, కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ ను డైరెక్ట్ చెయ్యాలని చిన్నప్పటినుండి అనుకునేవాడినని చెప్పారు. మరి, ఫ్యూచర్ లో ఈ జక్కన్న కోరిక తీరుతుందేమో చూడలి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa