ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అఫీషియల్ : "సూర్య 42" హీరోయిన్ గా దిశా పటాని

cinema |  Suryaa Desk  | Published : Fri, Aug 26, 2022, 03:55 PM

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య 42వ చిత్రం నిన్ననే పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. సిరుతై శివ డైరెక్షన్లో తెరకెక్కబోతున్న ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. సూర్య - DSP కాంబోలో రాబోతున్న ఐదవ సినిమా ఇది.
నిన్నటి నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించిన ఈ సినిమాలో సూర్యకు జోడిగా బాలీవుడ్ హాట్ బ్యూటీ దిశా పటాని నటించబోతుందని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతుంది. మూవీ టీం ఈ విషయంపై అధికారిక ప్రకటనైతే చెయ్యలేదు కానీ, పూజా కార్యక్రమానికి సంబంధించిన వీడియోను విడుదల చేసి హీరోయిన్ విషయంపై క్లారిటీ ఇచ్చింది. ఈ వీడియో డిస్క్రిప్షన్ లో క్యాస్టింగ్ లో దిశా పటాని పేరు ఉండడంతో ఈ మూవీ హీరోయిన్ ఎవరో తెలిసిపోయింది.
స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ సంయుక్త బ్యానర్ లపై జ్ఞాన్ వేల్ రాజా, ప్రమోద్, వంశి నిర్మిస్తున్న ఈ చిత్రంలో యోగిబాబు, కోవై సరళ, ఆనంద్ రాజ్ తదితరులు నటిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa