ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారీ మొత్తానికి అమ్ముడయ్యాయిన అక్షయ్ కుమార్ 'కట్‌పుట్లీ' డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్

cinema |  Suryaa Desk  | Published : Fri, Aug 26, 2022, 04:09 PM

టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ నటించిన సూపర్ హిట్ మూవీ రాక్షసుడు సినిమాని బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి మూవీ మేకర్స్ 'కట్‌పుట్లీ' అనే టైటిల్ ని లాక్ చేసారు. కసౌలి అనే చిన్న పట్టణంలో ఈ చిత్రం సెట్ చేయబడింది. అక్షయ్ కుమార్ ఈ సినిమాలో చంద్రచూర్ సింగ్ అనే పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో అక్షయ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ జోడిగా నటిస్తోంది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ సినిమా డిజిటల్ రైట్స్ ని డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ 125 కోట్లలకి సొంతం చేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా సెప్టెంబర్ 2వ తేదీ నుండి హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది అని సమాచారం. సస్పెన్స్ థ్రిల్లర్  ట్రాక్ లో రానున్న ఈ చిత్రాన్ని వాషు భగ్నాని నిర్మించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa