తేజ్ కూరపాటి, అఖిల ఆకర్షణ జంటగా నటించిన చిత్రం ‘నా వెంటపడుతున్న చిన్నాడెవడమ్మా’. వెంకట్‌వందెల దర్శకుడు. ముల్లేటి నాగేశ్వరావు నిర్మాణ సారథ్యంలో ముల్లేటి కమలాక్షి, గుబ్బల వెంకటేశ్వరావు నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబరు 2న విడుదల కానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలై పాటలకు మంచి స్పందన లభించింది. తాజాగా హీరో శ్రీకాంత్ చేతుల మీదుగా మరో పాటని విడుదల చేశారు. మేకర్స్. . డా భవ్య దీప్తి రెడ్డి రచించిన 'ఏకాంత సమయం' అంటూ సాగే ఈ రొమాంటిక్ సాంగ్ ఆకట్టుకునేలా ఉంది. సాంగ్ రిలీజ్ సందర్భంగా చిత్ర నిర్మాత ముల్లేటి కమలాక్షి మాట్లాడుతూ..ఒక రియాలిస్టిక్ ప్రేమకథను దర్శకుడు వెంకట్ చాలా బాగా డైరెక్షన్ చేశాడు. అనుకున్న టైమ్ కు, అనుకున్న బడ్జెట్ లో ఈ సినిమా తీశాము. ఈ సినిమాకు పెద్దలు తనికెళ్ళ భరణి, జీవా గార్ల తో పాటు నటించిన వారు మరియు టెక్నిషియన్స్ అందరూ డెడికేటెడ్ వర్క్ చేశారు. సెప్టెంబర్ 2 న ప్రేక్షకుల ముందుకు వస్తున్న మా సినిమాను ప్రేక్షకులందరూ ఆదరించి ఆశీర్వాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు..‘ ఈ చిత్రంలో యూత్ కి కావాల్సిన అన్ని అంశాలు ఇందులో వుంటాయి. ప్రేమకథ తో పాటు చక్కటి వినొదాన్ని మిక్స్ చేసి తెరక్కించామ’ని దర్శకుడు వెంకట్ వందెల అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa