ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హ‌ర్ర‌ర్ సినిమా ర‌హ‌స్యం

cinema |  Suryaa Desk  | Published : Wed, Oct 24, 2018, 10:59 AM

భీమవరం టాకీస్‌ పతాకంపై తెరకెక్కుతున్న హర్రర్‌ చిత్రం రహస్యం. విజయదశమి రోజున రామ్‌ గోపాలవర్మ, పూరి జగన్నాథ్‌ రహస్యం థియేట్రికల్‌ ట్రైలర్‌ విడుదల చేశారు. నిర్మాత రామ సత్యనారాయణ మాట్లాడుతూ మా చిత్ర దర్శకుడు సాగర్‌ శైలేష్‌ తన శక్తిని యుక్తిని ప్రాణాన్ని పణంగా పెట్టి ఈ సినిమా తీశారు. కచ్చితంగా హిట్‌ అయ్యే చిత్రమిది అని అన్నారు.


రామ్‌ గోపాల్‌వర్మ చిత్ర యూనిట్‌కు అభినందనలు. పూరి జగన్నాథ్‌ మాట్లాడుతూ రహస్యం చిత్రాన్ని దర్శకులు శైలేష్‌ స్టైల్‌గా తీశారు. ట్రైలర్‌ నాకు బాగా నచ్చింది. శైలేష్‌కు మంచి భవిష్యత్తు ఉంటుంది అని అన్నారు.


దర్శకుడు శైలేష్‌ మాట్లాడుతూ నాపై నమ్మకంతో దర్శకత్వ బాధ్యతలు అప్పగించారు. వారి నమ్మకాన్ని పూర్తిచేశానని భావిస్తున్నాను. వర్మ, పూరి గారి చేతుల మీదుగా ట్రైలర్‌ విడుదల కావడం ఆనందంగా ఉంది అని అన్నారు.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa