సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ నెల 27 న 'ఏన్ ఈవెనింగ్ విత్ సూపర్ స్టార్' అనే ఛారిటీ ఈవెంట్ లో పాల్గొనేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. గ్రామం ఫౌండేషన్.. హీల్ ఎ చైల్డ్ ఫౌండేషన్ల కోసం విరాళాలు సేకరించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వాహకులు న్యూయార్క్ లోని మారియట్ మార్కస్ హోటల్ లో ఏర్పాటు చేశారు. కానీ పెద్దగా స్పందన లేకపోవడంతో ఈవెంట్ ను రద్దు చేశారట.
ముందుగా అనుకున్నదాని ప్రకారం ఓ 100 ఎన్నారై కుటుంబాలు ఈ కార్యక్రమానికి హాజరవుతారని ఆశించారట. ఒక వ్యక్తికి $2000 లను ఎంట్రీ టికెట్ గా నిర్ణయించారట కానీ పెద్దగా రెస్పాన్స్ లేకపోవడంతో ఆ టికెట్ ధరను 750 డాలర్లు తగ్గించి 1250 డాలర్లు చేశారట. అయినప్పటికీ పెద్దగా స్పందన లేకపోవడంతో ఫైనల్ గా $450 కు ఫిక్స్ చేశారట. కానీ అప్పటికీ నిర్వాహకులు ఆశించిన స్పందన రాకపోవడంతో మొత్తం ప్రోగ్రామ్ ను క్యాన్సిల్ చేశారట.
ఏదేమైనా ఒక మంచి పనికోసం చేపట్టిన కార్యక్రమం ఇలా రద్దు కావడం నిరాశకు గురిచేసే విషయమే. ఇదిలా ఉంటే మహేష్ బాబు ప్రస్తుతం అమెరికాలో 'మహర్షి' షూటింగ్ లో పాల్గొంటున్నాడు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెకుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa