నందమూరి కళ్యాణ్ రామ్ "బింబిసార" ఇటీవల విడుదలై ఎంతటి ఘనవిజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సినిమా ఎంత పెద్ద హిట్టో మ్యూజిక్ ఆల్బం కూడా అంతే హిట్ అయ్యింది. చిరంతన్ భట్, వరికుప్పల యాదగిరి, ఎం ఎం కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందించారు.
లేటెస్ట్ గా ఈ సినిమా నుండి చిరంతన్ భట్ స్వరపరిచిన "గులేబకావళి" వీడియో సాంగ్ రిలీజ్ అయ్యింది. ఇదొక ఐటెం సాంగ్. ఆఫ్ఘనిస్తాన్ అమ్మాయి వారిన హుస్సేన్ ఈ సాంగ్ లో ఆడిపాడింది. ఈ పాటను చిన్మయీ శ్రీపాద ఆలపించగా, రామజోగయ్య శాస్త్రిగారు సాహిత్యమందించారు.
కొత్త దర్శకుడు వసిష్ఠ డైరెక్షన్లో నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన ఈ చిత్రం ఆగస్టు 5న విడుదలై సూపర్ హిట్ టాక్ తో థియేటర్లలో రన్ అవుతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa