టాలీవుడ్ మాస్ రాజా రవితేజ, కొత్త దర్శకుడు శరత్ మండవ డైరెక్షన్లో నటించిన చిత్రం "రామారావు ఆన్ డ్యూటీ". జూలై 29వ తేదీన థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం ఆరువారాల గ్యాప్ లోనే డిజిటల్ స్ట్రీమింగ్ కాబోతుందని మేకర్స్ అఫీషియల్ అప్డేట్ ఇచ్చారు.
తొలి షో నుండే మిక్స్డ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించడంలో విజయం సాధించలేకపోయింది. దీంతో మేకర్స్ అనుకున్న సమయానికన్నా ముందుగానే ఈ చిత్రాన్ని డిజిటల్ రంగంలోకి తీసుకురాబోతున్నారు. ఈ మేరకు ఈ చిత్రం సెప్టెంబర్ 15వ తేదీ నుండి ప్రఖ్యాత ఓటిటి సోనీ లివ్ లో స్ట్రీమింగ్ కాబోతుంది.
ఈ చిత్రంలో మజిలీ ఫేమ్ దివ్యాన్ష కౌశిక్, రజీషా విజయన్ హీరోయిన్లుగా నటించారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్, RT టీం వర్క్స్ బ్యానర్ లపై సుధాకర్ చెరుకూరి నిర్మించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa