మెగా హీరో వైష్ణవ్ తేజ్ తాజా చిత్రం 'రంగ రంగ వైభవంగా' సెప్టెంబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో భాగంగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తిచేసుకుంది. ఈ సినిమా సెన్సార్ బోర్డు నుంచి U/A సర్టిఫికెట్‌ను దక్కించుకుంది. ఈ సినిమా నిడివి విషయంలో కూడా క్లారిటీ వచ్చింది. రంగరంగ వైభవంగా రెండు గంటల 23 నిమిషాలు ఉండనుంది.
ఇక ఈ సినిమాను మొదట జూలై 1న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు టీమ్ అయితే.. ఏవో కారణాల వల్ల ఈ సినిమా వాయిదా పడింది. యూత్ ఫుల్ ఎంటర్టైనర్‌గా వస్తున్న ఈ సినిమాకు గిరీశయ్య దర్శకుడు. ఇక ఈ చిత్రం నుంచి ప్రమోషన్‌లో భాగంగా ఇటీవల రిలీజైన ట్రైలర్ మంచి రెస్పాన్స్‌ను దక్కించుకుంది. దీనికి తోడు పాటలు మంచి ఆదరణ పొందాయి. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా బి వి ఎస్ ఎన్ ప్రసాద్ నిర్మాణం వహిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa