మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 154వ చిత్రానికి డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు బాబీ (కే ఎస్ రవీంద్ర). ప్రస్తుతం ఈ మూవీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. మాస్ రాజా రవితేజ కీలక పాత్రను పోషిస్తున్న ఈ చిత్రంలో శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తుంది.
తాజాగా బాబీ తండ్రి కొల్లి మోహనరావుగారు హఠాన్మరణం చెందినట్టు తెలుస్తుంది. కొన్నాళ్లుగా కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న మోహనరావుగారు రెండ్రోజుల క్రితం ఒక ప్రైవేట్ హాస్పిటల్ లో జాయిన్ అయ్యారు. ఈ రోజు మధ్యాహ్నం ఆఖరి శ్వాసను విడిచారు. గుంటూరులో మోహన్ రావుగారి అంతక్రియల కార్యక్రమం జరగనుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa