వైష్ణవ్ తేజ్, 'రొమాంటిక్' ఫేమ్ కేతికా శర్మ జంటగా గిరీశాయ డైరెక్షన్లో రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న చిత్రం "రంగరంగ వైభవంగా".
సెప్టెంబర్ 2న థియేటర్లలో విడుదల కాబోతున్న ఈ చిత్రం నుండి సిరి సిరి మువ్వల్లోన అనే ఫుల్ వీడియో సాంగ్ కొంచెంసేపటి క్రితమే విడుదలైంది. DSP స్వరపరిచిన ఈ పాటను జావేద్ అలీ, శ్రేయా ఘోషల్ ఆలపించారు. DSP నుండి ఈ మధ్యకాలంలో వచ్చిన బెస్ట్ మెలోడియస్ సాంగ్స్ లో ఇదొకటని క్లియర్ గా చెప్పవచ్చు.
ఈ మూవీ నుండి ఇప్పటివరకు విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ ప్రేక్షకులను విశేషంగా ఆకర్షిస్తుండడంతో సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. మరి, మెగా మేనల్లుడు కెరీర్ లో సెకండ్ హిట్ అందుకుంటుంటాడో లేదో చూడాలి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa