ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గోపీచంద్ మలినేని సెల్ఫీ పిక్ వైరల్

cinema |  Suryaa Desk  | Published : Tue, Aug 30, 2022, 02:05 PM

ప్రస్తుతం నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా మరో మాస్ దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తున్న సాలిడ్ ఎంటర్టైనర్ కోసం అందరికీ తెలిసిందే. బాలయ్య కెరీర్ లో 107వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ చిత్రం ఇప్పుడు విదేశాల్లో షూటింగ్ ని జరుపుకుంటుంది.ప్రస్తుతం ఓ పాటని తెరకెక్కిస్తుండగా బాలయ్య తెలుగు ఇండస్ట్రీ లో అడుగు పెట్టి ఈరోజుతో 48 ఏళ్ళు పూర్తి కావడంతో సినిమా సెట్స్ నుంచి అయితే దర్శకుడు గోపీచంద్ మలినేని ఒక స్పెషల్ పిక్ షేర్ చేసి ఈ స్పెషల్ డే కి గిఫ్ట్ గా అందించాడు. మరి ఇందులో బాలయ్య హీరోయిన్ శృతి హాసన్ లు సెల్ఫీ కి పోజ్ ఇవ్వగా దర్శకుడు గోపీచంద్ అయితే దీని క్లిక్ మనిపించాడు. ఇక దీనితో ఈ ఫోటో వైరల్ గా మారింది.


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa