ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'లైగర్' OTT విడుదల తేదీ పై లేటెస్ట్ బజ్

cinema |  Suryaa Desk  | Published : Tue, Aug 30, 2022, 06:54 PM

పూరి జగన్నాధ్ దర్శకత్వంలో టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నటించిన "లైగర్" సినిమా గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. స్పోర్ట్స్ డ్రామా ట్రాక్ లో వచ్చిన ఈ సినిమా విడుదలైన అన్ని చోట్ల మిక్సీడ్ రివ్యూస్ అందుకొని సాలిడ్ కలెక్షన్స్ ని రాబడుతుంది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని ప్రముఖ OTT ప్లాట్ఫారంలో ఒకటైన డిస్నీప్లస్ హాట్స్టార్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. తాజా అప్డేట్ ప్రకారం, ఈ చిత్రం OTT ప్లాట్‌ఫారమ్‌లో సెప్టెంబర్ 30, 2022న ప్రసారానికి అందుబాటులోకి రానుంది అని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయం గురించి మూవీ టీమ్ నుండి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.


ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన జోడిగా బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే జోడిగా నటిస్తుంది. ఈ సినిమాలో లెజెండరీ బాక్సర్ మైక్ టైసన్ కీలక పాత్రను పోషిస్తున్నాడు. రమ్యకృష్ణ, రోనిత్ రాయ్, విషు రెడ్డి, అలీ, మకరంద్ దేశ్ పాండే, గెటప్ శ్రీను ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. పూరి కనెక్ట్స్, ధర్మ ప్రొడక్షన్స్‌తో కలిసి ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa