శివ కార్తీక్ దర్శకత్వంలో కోలీవుడ్ స్టార్ హీరో కిచ్చా సుదీప్ ఒక క్రేజీ ప్రాజెక్ట్ ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకి తెలుగులో 'K3 కోటికొక్కడు' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. ఎట్టకేలకు ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమైంది. అనేక వాయిదాల తర్వాత, ఈ సినిమా సెప్టెంబర్ 16, 2022న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో కిచ్చా సుదీప్ డ్యూయల్ రోల్ లో కనిపించనున్నారు. ఈ చిత్రంలో మడోన్నా సెబాస్టియన్, శ్రద్ధాదాస్, రవిశంకర్, నవాబ్ షా తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ కి సంబందించిన మరిన్ని వివరాలు మూవీ మేకర్స్ త్వరలో వెల్లడిచేయనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa