ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాఖీ సావంత్ సంచలన వ్యాఖ్యలు

cinema |  Suryaa Desk  | Published : Sat, Oct 27, 2018, 12:33 PM

సినిమా పరిశ్రమలో 99 శాతం మంది హీరోయిన్లు, నిర్మాతలు తదితరులతో సెక్స్ చేసేందుకు అంగీకరించే వస్తారని నటి రాఖీ సావంత్ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇటీవల ఓ ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చిన ఆమె, మహిళలు తమంతట తాముగా అంగీకరించే, మరిన్ని అవకాశాలు ఇస్తారన్న ఉద్దేశంతో పడకగదికి వస్తారని, ఈ విషయంలో వారిని భయపెట్టేవారు, బలవంతం చేసేవారు, అత్యాచారాలకు పాల్పడేవారు ఎవరూ ఉండరని చెప్పింది. మహిళలను లైంగికంగా వాడుకునే విషయంలో కాస్టింగ్ డైరెక్టరకు బాధ్యత ఉంటుందని, సినిమా అవకాశాల కోసం వచ్చేవారు తొలుత వీరి వలలోనే పడతారని వెల్లడించింది. ఈ విషయంలో మగవారు ఆడవాళ్ల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలని, ఒకసారి పడకగదికి వచ్చిన అమ్మాయి, ఆపై వారిని బెదిరించి, బ్లాక్ మెయిల్ కు కూడా దిగవచ్చని రాఖీ సావంత్ హెచ్చరించింది. ఆమె మాటల వీడియోను మీరూ చూడవచ్చు.


 


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa