ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రిన్స్ మహేష్ సైతం తన కిడ్స్ తో ..

cinema |  Suryaa Desk  | Published : Sat, Oct 27, 2018, 12:43 PM

మన స్టార్లకు సరదాగా సాయంత్రాలు దొరికితే చాలు .. వెంటనే ఫ్యామిలీతో డిన్నర్ డేట్లకు ప్లాన్ చేసేస్తున్నారు. కుటుంబ సమేతంగా పిల్లా పాపలతో కలిసి సిటీలో ఏదైనా ఖరీదైన రెస్టారెంట్ కి వెళ్లి అక్కడ సెలబ్రేట్ చేస్తున్నారు. తమ విలువైన సమయాన్ని పిల్లలతో స్పెండ్ చేస్తూ సేద దీరుతున్నారు. ఇదివరకూ బన్ని- స్నేహ ఈ తరహాలో లంచ్ డేట్లు ప్లాన్ చేశారు. వీళ్లతో పాటు ఓ గుంపు పిల్లలు కూడా కనిపించారు. జగమంత కుటుంబం నాది! అన్న చందంగా సెలబ్రేషన్ మూవ్ మెంట్ కన్నులపండువ చేసింది.


నిన్నటికి నిన్న మెగాస్టార్ చిరంజీవి సైతం మెగా ఫ్యామిలీలోని కిడ్స్ అందరితో కలిసి అదిరిపోయే పార్టీ చేసుకున్నారు. ఆ పార్టీలో పిల్లలు భయపెట్టే భూతప్రేతాల లుక్ తో భయంకర గెటప్పులతో అదరగొట్టారు. మాస్క్ లు వగైరా ధరించి ఆకట్టుకున్నారు. ఇందులో చెర్రీ - ఉపాసన కనిపించారు.


వీళ్లంతా ఇంత చేస్తే అందరికీ పోటీనా అన్నట్టు ప్రిన్స్ మహేష్ సైతం తన కిడ్స్ తో మరోసారి డిన్నర్ డేట్ ప్లాన్ చేశాడు. సరదాగా అలా లోకల్ రెస్టారెంట్ కి వెళ్లి గౌతమ్ - సితార వీళ్ల స్నేహితులతో కలిసి డిన్నర్ డేట్ ప్లాన్ చేశారు. ఈ ఫోటోలోనూ అల్లరి సితార అల్లరల్లరి చేస్తున్న తీరు తెగ నవ్విస్తోంది. ముసిముసి నవ్వులతో చిలౌట్ బోయ్ లా సూపర్ స్టార్ మహేష్ అక్కడ కనిపించారు. మహర్షివో.. మునివో.. మొత్తానికి ఫ్యామిలీతో బాగానే ఎంజాయ్ చేస్తున్నారు మహేష్ సారు! తదుపరి భారీ షెడ్యూల్స్ తో కుస్తీ పట్టాల్సి ఉంటుంది కాబట్టి ఈ రిలీఫ్ ఎంతో ఇంపార్టెంట్ అన్నమాట!! 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa