ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'సాలార్' తదుపరి షెడ్యూల్ పై లేటెస్ట్ బజ్

cinema |  Suryaa Desk  | Published : Wed, Aug 31, 2022, 05:05 PM

ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ 'సాలార్' సినిమాలో నటిస్తున్న సంగతి అందరికి తెలిసిందే. యాక్షన్ థ్రిల్లర్ ట్రాక్ లో వస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన శృతి హాసన్ నటిస్తుంది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ సినిమా తదుపరి షెడ్యూల్ సెప్టెంబర్ 4, 2022 న ప్రారంభం కానున్నట్లు సమచారం. ఈ షెడ్యూల్ నెలాఖరు వరకు జరుగుతుందని సమాచారం. ఈ విషయం గురించి మూవీ టీమ్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అందరూ ఎంతో ఆశక్తిగా ఎదురుచూస్తున్న సాలార్ మూవీ సెప్టెంబర్ 28, 2023న థియేటర్లలోకి రానుందని మూవీ మేకర్స్ అధికారకంగా ధృవీకరించారు. ఈ సినిమాలో గోపీ, జగపతిబాబు, పృథ్వీరాజ్ సుకుమారన్, ఈశ్వరీ రావు, పొగరు ఫేమ్ శ్రీయా రెడ్డి కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని హోంబలే ఫిల్మ్స్ పతాకంపై విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa