టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ సురేష్ బాబు కొడుకైన అభిరామ్ దగ్గుబాటి త్వరలోనే వెండితెరపై ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే దర్శకుడు తేజ డైరెక్షన్‌లో ఈ సినిమాను ప్రారంభించిన చిత్ర యూనిట్, ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన రిలీజ్ విషయంలో ఓ నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది.
‘అహింస’ అనే టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం పూర్తయినట్లు తెలుస్తోంది. దీంతో ఈ సినిమాను త్వరలోనే రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యిందట. ఈ క్రమంలో అహింస చిత్రాన్ని సెప్టెంబర్ 30న భారీ స్థాయిలో రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోందట. ఈ సినిమాలో అభిరామ్ పాత్ర ప్రేక్షకులను ఖచ్చితంగా ఆకట్టుకునే రీతిలో ఉంటుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.