మొదటి రోజు నుంచే హౌస్ లో ఆట మొదలైపోయింది. మొదటి రోజు గొడవలు, ఏడుపులు అయ్యాయి. మొదట అందరూ డ్యాన్సులు వేస్తూ హ్యాపీగా ఉన్నారు. ఆ తర్వాత క్లాస్, ట్రాష్, మాస్ విభాగాలుగా కంటెస్టెంట్స్ ని డివైడ్ అవ్వమని టాస్క్ ఇచ్చారు. ఇందులో ట్రాష్ లో ఉన్న వాళ్ళతో తమ జీవిత కథని చెప్పమన్నాడు బిగ్‌బాస్. దీంతో ట్రాష్ లో ఉన్న ఇనయా సుల్తానా, గీతూ రాయల్, సింగర్ రేవంత్ తమ కన్నీటి గాధని చెప్పారు. ఈ క్రమంలో హౌస్ లో ఇనయా సుల్తానా మాట్లాడుతూ.. ”సినిమాల్లో రాణించాలనేది మా నాన్న డ్రీమ్. కానీ కుటుంబం కోసం ఆయన డ్రీమ్‌ని త్యాగం చేయాల్సి వచ్చింది. తన కోరిక తీరకుండానే నాన్న చనిపోయారు. తండ్రి కోరికని నెరవేర్చడం కోసం నేను సినిమా రంగంలోకి వచ్చాను. కానీ నేను ఇండస్ట్రీకి రావడం ఇంట్లో ఎవరికీ ఇష్టం లేదు. మా అమ్మ కూడా వద్దంది. దీంతో ఇంట్లో నుంచి పారిపోయి ఇండస్ట్రీకి వచ్చేశాను. ఇండస్ట్రీ కష్టాల గురించి అందరికి తెలిసిందే. హైదరాబాద్‌లో ఉంటూ అనేక కష్టాలు పడ్డాను, తిండి లేకుండా పస్తులుండాల్సిన రోజులు కూడా చూశాను. హాస్టల్ లో ఉన్నప్పుడు ఆలస్యంగా వెళ్తే ఫుడ్ అయిపోయేది, కొన్ని సార్లు అన్నం మాత్రమే ఉంటే అందులో నీళ్లు పోసుకొని తినేదాన్ని. సినిమాల్లోకి మా నాన్న కోరికని నెరవేర్చడానికి వచ్చాను. ఇంకా ఫేమ్ తెచ్చుకొని ఎక్కువ సినిమాలు చేసి మా నాన్న కోరిక నెరవేర్చాలి” అని ఏడుస్తూ ఎమోషనల్ అయింది.