ట్రెండింగ్
Epaper    English    தமிழ்

OTT విడుదల తేదీని ఖరారు చేసిన 'భీమ్లా నాయక్' తమిళ వెర్షన్‌

cinema |  Suryaa Desk  | Published : Tue, Sep 06, 2022, 08:52 PM

సాగర్ కే చంద్ర డైరెక్షన్ లో టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అండ్ హ్యాండ్సమ్ హంక్ రానా దగ్గుబాటి నటించిన యాక్షన్ డ్రామా 'భీమ్లా నాయక్' బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది. ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో నిత్యా మీనన్, సంయుక్త మీనన్ కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో సముద్రఖని, రావు రమేష్, మురళీ శర్మ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, భీమ్లా నాయక్ మూవీ తమిళ-డబ్బింగ్ వెర్షన్ ఆహా తమిళ్‌లో సెప్టెంబర్ 9, 2022న ప్రసారానికి అందుబాటులోకి రానుంది అని సమాచారం. "భీమ్లా నాయక్" చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై సూర్యదేవర నాగ వంశీ నిర్మించారు. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa