నందమూరి బాలకృష్ణ, డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్లో, NBK 107 వర్కింగ్ టైటిల్ తో ఒక సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.
ఈరోజు బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ తేజ 28వ పుట్టినరోజు. ఈ సందర్భంగా NBK 107 సెట్స్ లో మోక్షజ్ఞ బర్త్ డే సెలెబ్రేషన్స్ జరిగాయి. ఈ సెలెబ్రేషన్స్ లో మూవీ టీం అంతా పాల్గొన్నట్టు తెలుస్తుంది. హీరోయిన్ శృతి హాసన్, డైరెక్టర్ గోపీచంద్ మలినేని, సప్తగిరి తదితరులు పాల్గొన్నారు. బాలయ్య సతీమణి వసుంధర కూడా ఈ సెలెబ్రేషన్స్లో పాల్గొనడం విశేషం.
మోక్షజ్ఞ పుట్టినరోజుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa